Corona Virus: అలాంటి అపోహలుంటే పక్కనపెట్టండి.. ఒమిక్రాన్‌పై హెచ్చరించిన తాజా అధ్యయనం

Omicron Variant can escape be alert warns new study

  • గతంలో కరోనా సోకినా ఒమిక్రాన్‌తో ముప్పుతప్పదు
  • రక్షణ వ్యవస్థను బురిడీ కొట్టిస్తుంది
  • అప్రమత్తంగా ఉండాల్సిందే

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై తాజా అధ్యయనం ఒకటి హెచ్చరికలు జారీ చేసింది. గతంలో సోకిన ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ఏర్పడిన రక్షణ వ్యవస్థ నుంచి కొత్త వేరియంట్ తప్పించుకోగలుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.

కాబట్టి గతంలో కరోనా బారినపడిన వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకదన్న అపోహలు ఏమైనా ఉంటే వాటిని పక్కనపెట్టి అప్రమత్తంగా ఉండాలని అధ్యయనకారులు హెచ్చరించారు. మునుపటి ఇన్ఫెక్షన్‌తో ఏర్పడిన రక్షణ వ్యవస్థను ఒమిక్రాన్ తప్పుదోవ పట్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలో తేలిందని వివరించారు.

  • Loading...

More Telugu News