Odisha: ఖాళీ బీర్‌ క్యాన్‌లో త‌ల‌దూర్చి త‌ల్ల‌డిల్లిపోయిన పాము.. వీడియో ఇదిగో

Cobra Trapped In Beer Can Rescued In Bhubaneswar

  • ఒడిశాలో ఘ‌ట‌న‌
  • పొద‌ల్లో బీర్ క్యాన్‌
  • అందులో ఇరుక్కుపోయిన పాము
  • ర‌క్షించిన సిబ్బంది

ఖాళీ బీర్‌ క్యాన్‌లో చిక్కుకుని ఓ నాగుపాము త‌ల్ల‌డిల్లిపోయింది. ఎవ‌రో బీర్ క్యాన్ తాగి చెట్ల పొద‌ల మ‌ధ్య ప‌డేయ‌గా అందులో నాగుపాము త‌ల‌దూర్చింది. మ‌ళ్లీ బ‌య‌ట‌కు రాలేక‌పోయింది. ఒడిశాలోని పూరీ జిల్లా బొలొంగొ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జితేంద్ర మహాపాత్రొ పెరటిలో ఖాళీ బీర్ క్యాన్‌లో పాము ఉన్న‌  విష‌యాన్ని గుర్తించిన స్థానికులు ఆ పామును ర‌క్షించ‌డానికి ప్ర‌య‌త్నించారు.

స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు వారు ఫోన్ చేశారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న హెల్ప్‌లైన్‌ సభ్యుడు సుశాంత కుమార్ బీర్ క్యాన్‌ను క‌ట్ చేశాడు. నాగుపాము గాయపడకుండా అందులోంచి బయటకు తీసి అట‌వీ ప్రాంతంలో విడిచి పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.          

    

  • Error fetching data: Network response was not ok

More Telugu News