Balakrishna: 'అఖండ'కి హిట్ టాక్ .. శ్రీకాంత్ సుడి తిరిగినట్టే!

Akhanda movie update

  • ఈ రోజే విడుదలైన 'అఖండ'
  • తొలి ఆటతోనే హిట్ టాక్
  • బాలయ్య అభిమానుల సందడి  
  • శ్రీకాంత్ కి లభిస్తున్న ప్రశంసలు

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఎక్కడ చూసినా బాలయ్య అభిమానుల సందడి కనిపిస్తోంది.

రైతుగాను .. అఘోరాగాను బాలకృష్ణ అదరగొట్టేశారని చెప్పుకుంటున్నారు. ఇక శ్రీకాంత్ కూడా ప్రతినాయకుడిగా తన పాత్రలో జీవించాడని అంటున్నారు. ఫ్యామిలీ హీరోగా సుదీర్ఘకాలం పాటు కొనసాగిన శ్రీకాంత్, విలన్ గా ఎలా మెప్పిస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ తెరపై శ్రీకాంత్ కాకుండా ఆయన పోషించిన వరదరాజులు పాత్ర మాత్రమే కనిపించిందని అంటున్నారు.

అంత గొప్పగా ఆ పాత్రకి ఆయన న్యాయం చేశాడని చెబుతున్నారు. గతంలో బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో విలన్ గా పరిచయమైన జగపతిబాబు, స్టార్ విలన్ గా కొనసాగుతున్నాడు. అలాగే శ్రీకాంత్ కూడా ఇక విలన్ పాత్రల్లో దూసుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Balakrishna
Pragya Jaiswal
Srikanth
Akhanda Movie
  • Loading...

More Telugu News