Kadapa District: కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌

jagan reaches kadapa

  • వరద ప్రభావిత జిల్లాల్లో నేడు, రేపు ప‌ర్య‌ట‌న‌
  • క‌డప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజ‌ల‌తో మాట్లాడ‌నున్న జ‌గ‌న్
  • అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళ్లనున్న సీఎం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి పులమత్తూరు గ్రామానికి బయలుదేరారు. వరద ప్రభావిత జిల్లాల్లో నేడు, రేపు ఆయ‌న‌  క్షేత్రస్థాయి పర్యటన చేస్తారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆయ‌న‌ పర్యటన కొనసాగుతుంది.

నేడు పుల్ల పొత్తూరు గ్రామంలో పర్యటించనున్న జ‌గ‌న్ వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను ప‌రిశీలిస్తారు. అక్క‌డి సహాయ శిబిరంలో ఉన్న వారితో మాట్లాడ‌తారు. అనంత‌రం ఎగుమందపల్లి వెళ్తారు. ఆ ప్రాంతంలో కాలినడకన పర్యటిస్తారు. ఆ త‌ర్వాత‌ అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళ్లి దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలిస్తారు.

ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై జ‌గ‌న్ కు అధికారులు వివ‌రాలు తెలుపుతారు. అక్క‌డి నుంచి జ‌గ‌న్ మందపల్లి చేరుకుంటారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ త‌ర్వాత‌ చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వేదలచెరువు ఇత‌ర కాల‌నీల ప్రజలతో మాట్లాడ‌తారు. ఈ రోజు సాయ‌త్రం ఏర్పేడు మండలం, పాపనాయుడు పేట గ్రామాల్లో ప‌ర్య‌టిస్తారు.

ఆ త‌ర్వాత‌ తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్తారు. ఈ రోజు రాత్రి పద్మావతి అతిథి గృహంలో బసచేస్తారు. రేపు జ‌గ‌న్ చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. వరద నష్టాన్ని పరిశీలించి, స్ధానికులతో ముఖాముఖి మాట్లాడ‌తారు.  

నెల్లూరు రూరల్ లోనూ ఆయ‌న ప‌ర్య‌టన కొన‌సాగుతుంది. రేపు మ‌ధ్యాహ్నం నెల్లూరు నగరపాలక సంస్ధ ప‌రిధిలోని కాల‌నీల‌ను ప‌రిశీలిస్తారు. రేపు సాయ‌త్రం 4.30 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి కాన్వాయ్‌లో తాడేపల్లి వెళ్తారు.

  • Loading...

More Telugu News