Allu Arjun: వరద బాధితుల సహాయార్థం అల్లు అర్జున్ విరాళం

Allu Arjun gives donation for flood relief works
  • ఏపీని ముంచెత్తిన భారీ వర్షాలు
  • తీవ్రంగా నష్టపోయిన పలు జిల్లాల ప్రజలు
  • తన వంతుగా రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన అల్లు అర్జున్
ఏపీని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షాలకు పలు జిల్లాలు నీట మునిగాయి. చెరువుల కట్టలు తెగిపోయి గ్రామాలను ముంచెత్తాయి. పంటలు నాశనం అయ్యాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆర్థికసాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు వరదబాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాలపాలవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. వాళ్లకు తనవంతు సాయం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందజేస్తున్నానని తెలిపారు. మరోవైపు ఇప్పటికే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షల చొప్పున విరాళాలను అందించారు. అందరి కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ విరాళాన్ని అందజేశారు.
Allu Arjun
Tollywood
Donation
Floods
CM Relief Fund

More Telugu News