AP Employees: సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఏపీ ఉద్యోగ సంఘాలు

AP employees decide to protest

  • నిరసనలు, ధర్నాల బాటపట్టిన ఉద్యోగ సంఘాలు
  • సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్
  • జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ధర్నాలు
  • రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సదస్సులు

అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి. డిసెంబరు 1న ఏపీ సీఎస్ కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. అదే రోజున అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసనలు తెలపనున్నారు. 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. 10వ తేదీన మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు.

జిల్లాల్లోని తాలూకా కేంద్రాల్లో 16వ తేదీన ధర్నాలు చేపట్టనున్నారు. 21వ తేదీన జిల్లా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు మహా ధర్నా నిర్వహించనున్నారు. డిసెంబరు 27న విశాఖలో, 30న తిరుపతిలో, జనవరి 2న ఏలూరులో, 6న ఒంగోలులో భారీ ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్టు ఏపీ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

AP Employees
Protests
Demands
Andhra Pradesh
  • Loading...

More Telugu News