leaves: వచ్చే సంవత్సరం తెలంగాణలో సెలవుల లిస్ట్ ఇదిగో
![leaves list in ts](https://imgd.ap7am.com/thumbnail/cr-20211127tn61a1bfe0426c1.jpg)
- ప్రభుత్వ కార్యాలయాలకు 28 సాధారణ సెలవులు
- మరో 23 రోజుల ఆప్షనల్ సెలవులు
- వేతనంతో కూడిన సెలవులు మొత్తం 23
తెలంగాణ సర్కారు వచ్చే ఏడాది (2022) సెలవుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 28 సాధారణ సెలవులు ఉన్నాయి. మరో 23 రోజుల ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. వేతనంతో కూడిన సెలవులు మొత్తం 23గా నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న సెలవు ఇస్తున్న కారణంగా ఫిబ్రవరి రెండో శనివారం పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. సెలవుల్లో కొన్నింటిని సంస్థల యాజమాన్య అనుమతితో తీసుకోవాల్సి ఉంటుంది.
సెలవుల పూర్తి జాబితా..
![](https://img.ap7am.com/froala-uploads/20211127fr61a1bdf111e80.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20211127fr61a1be1973653.jpg)