Vijay Devarakonda: లాస్ వెగాస్ లో షూటింగ్ పూర్తి చేసిన 'లైగర్'

Liger movie updare

  • షూటింగు దశలో 'లైగర్'
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
  • అతిథి పాత్రలో మైక్ టైసన్
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ  

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమాను రూపొందిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే ఈ కథలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ముంబై .. గోవాలాంటి ప్రాంతాల్లో ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఆ తరువాత షెడ్యూల్ కోసం ఇటీవలే ఈ సినిమా టీమ్ 'లాస్ వెగాస్' వెళ్లింది. విజయ్ దేవరకొండ .. అనన్య పాండే తదితరుల కాంబినేషన్లోని సన్నివేశాలను కొన్ని రోజులుగా అక్కడ చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేశారు. హైదరాబాద్ లో జరపనున్న చివరి షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. రమ్యకృష్ణ .. మకరంద్ దేశ్ పాండే .. రోనిత్ రాయ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. మణిశర్మ రీ రికార్డింగ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని అంటున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Vijay Devarakonda
Ananya Pandey
Puri Jagannadh
Liger Movie
  • Loading...

More Telugu News