Manchu Vishnu: శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం కోసం వైద్యులు ఎంతో శ్రమిస్తున్నారు: మంచు విష్ణు

Manchu Vishnu talks about Shiva Shankar master health
  • ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడాను
  • శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం కోసం వైద్యులు శ్రమిస్తున్నారు
  • ఆయన కుటుంబానికి అందరి ఆశీస్సులు కావాలి
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనా బారిన పడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పెద్ద కుమారుడు సైతం కరోనా బారిన పడి అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో తాను మాట్లాడానని... ఆయన కోలుకునేందుకు అన్ని విధాలుగా చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారని విష్ణు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం కోసం ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. శివశంకర్ రెండో కుమారుడు అజయ్ తో ఇప్పుడే ఫోన్ లో మాట్లాడానని తెలిపారు. ఆయన కుటుంబానికి మీ అందరి ప్రార్థనలు ఎంతో అవసరమని చెప్పారు.

శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడు ఇద్దరికీ కరోనా సోకింది. బిల్లులు చెల్లించడానికి ఆయన కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సాయం చేసేందుకు సినీ నటులు ధనుష్, సోను సూద్ తదితరులు ఇప్పటికే ముందుకొచ్చారు.
Manchu Vishnu
Tollywood
Shiva Shankar Master
Corona Virus

More Telugu News