ప్రభుదేవాతో అనసూయ కోలీవుడ్ ఎంట్రీ!
- వరుస సినిమాలతో బిజీగా అనసూయ
- వచ్చే ఏడాదిలో పెరగనున్న జోరు
- మలయాళ తెరకి పరిచయం
- తమిళ మూవీ 'ఫ్లాష్ బ్యాక్'లో ఛాన్స్
ఆచార్య .. పుష్ప .. ఖిలాడి .. పక్కా కమర్షియల్ .. రంగమార్తాండ వంటి సినిమాలలో, ప్రాధాన్యత కలిగిన పాత్రలలో అనసూయ కనిపించనుంది. ఈ సినిమా తరువాత ఆమె రేంజ్ మారడం ఖాయమనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మలయాళ తెరకి పరిచయమవుతోంది.
ఇక ఇదే సమయంలో తమిళంలోను ఆమె ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుదేవా - రెజీనా నాయకా నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో, అనసూయ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి 'ఫ్లాష్ బ్యాక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రమేశ్ పిళ్లై నిర్మిస్తున్న ఈ సినిమాకి శాండీ దర్శకత్వం వహిస్తున్నాడు.