Andhra Pradesh: జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తారు?.. వర్ల రామయ్య వ్యాఖ్యలపై నాని స్పందన

Kodali Nani Response On Varla Ramaiah Comments
  • ఆయన చెబితే మేమెందుకు వింటాం
  • నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులు 
  • గొర్రె కసాయివాడిని నమ్మినట్టు వాళ్లు ఆయన్నే నమ్ముతారు
  • చంద్రబాబే ఆయన భార్యను అల్లరి చేసుకుంటున్నారు
శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆయన భార్య పేరును వాడుకుంటే నందమూరి కుటుంబం మద్దతిస్తుందనే చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. వర్ల రామయ్య కామెంట్లపై ఆయన స్పందించారు. అసెంబ్లీలోగానీ, బయటగానీ ఆమె పేరును తాము ప్రస్తావించలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు తన భార్యను తానే అల్లరి చేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను అనని మాటలకు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు.

జూనియర్ ఎన్టీఆర్ తమను ఎలా కంట్రోల్ చేస్తాడని నాని అన్నారు. ఆయన చెబితే తామెందుకు వింటామన్నారు. నందమూరి కుటుంబమంటే సీఎం జగన్ కూ గౌరవమేనన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులన్నారు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్నట్టు.. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబును నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సీఎంగా ఉంటే పార్టీ నాశనమవుతుందని నాడు చంద్రబాబు చెబితే నమ్మేశారని నాని గుర్తు చేశారు.
Andhra Pradesh
Kodali Nani
Junior NTR
Varla Ramaiah
YSRCP

More Telugu News