Allu Arjun: 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారైనట్టే!

Pushpa movie update

  • సుకుమార్ తాజా చిత్రంగా 'పుష్ప'
  • దేవిశ్రీ పాటలకు మంచి రెస్పాన్స్
  • వచ్చేనెల 12న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 17వ తేదీన వివిధ భాషల్లో సినిమా రిలీజ్    

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. ప్రతి పాట కూడా జనంలోకి దూసుకుపోయింది.

రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు ఎక్కడ నిర్వహించనున్నారు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులోనే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

డిసెంబర్ 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. దాదాపు అదే డేట్ ఖరారు కావొచ్చునని అంటున్నారు. వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో, ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా .. జగపతిబాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

Allu Arjun
Rashmika Mandanna
jagapathi Babu
Pushpa Movie
  • Loading...

More Telugu News