Talasani: ఆఫీసులపై దాడి చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు: బీజేపీ కార్పొరేటర్లపై తలసాని ఆగ్రహం

Talasani fires on BJP Corporators

  • జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడి
  • ఘటనను ఖండించిన తలసాని
  • బీజేపీ శ్రేణులు దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డాయని వ్యాఖ్యలు
  • బాధ్యతగా వ్యవహరించాలని హితవు

జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. బీజేపీ శ్రేణులు దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డాయని విమర్శించారు. ఆఫీసులపై దాడి అంటే ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల పట్ల ఎవరూ హర్షించరని పేర్కొన్నారు. ఆఫీసులపై దాడి చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. బీజేపీ కార్పొరేటర్లు ఇకనైనా బాధ్యతగా ఉండాలని హితవు పలికారు. ఏదైనా సమస్య ఉంటే మేయర్ తో చర్చించాలని అన్నారు.

కాగా, జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి బీజేపీ కార్పొరేటర్లు చొరబడి, ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News