Sampoornesh Babu: కొత్త పాయింట్ తో తయారైన 'క్యాలీ ఫ్లవర్'

Cauliflower movie update

  • సంపూ తాజా చిత్రంగా 'క్యాలీ ఫ్లవర్'
  • డిఫరెంట్ లుక్స్ తో రెండు పాత్రలు
  • ఈ నెల 26వ తేదీన విడుదల
  • లైన్లో 5 సినిమాలు

సంపూర్ణేశ్ బాబు హీరోగా 'క్యాలీ ఫ్లవర్' రూపొందింది. ఆశాజ్యోతి నిర్మించిన ఈ సినిమాకి ఆర్కే మలినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో వాసంతి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి సంపూ మాట్లాడాడు.

"శీలం అనేది ఆడవాళ్లకి మాత్రమే కాదు .. మగవాళ్లకి కూడా చాలా ముఖ్యమైనదనే కొత్త పాయింట్ ను మా డైరెక్టర్ చెప్పాడు. ఈ పాయింట్ నచ్చడం వల్లనే నేను ఈ సినిమాను చేయడానికి అంగీకరించాను. ఈ సినిమాలో నేను రెండు పాత్రలలో కనిపిస్తాను. నా పోస్టర్ కి వస్తున్న రెస్పాన్స్ తో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది.

ఈ సినిమా .. ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్విస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది కాకుండా మరో 5 సినిమాలు లైన్లో ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి సంబంధం లేని జోనర్ల నుంచి రానున్నాయి. తమిళంలో కూడా ఒక సినిమా చేస్తున్నాను. ఇకపై ఇతర హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను కూడా వరుసగా చేయాలనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.

Sampoornesh Babu
Vasanthi
Cauliflower Movie
  • Loading...

More Telugu News