Srikanth: విలన్ గా శ్రీకాంత్ నిలబడేనా?

Akhanda movie update

  • బాలయ్య నుంచి 'అఖండ'
  • బోయపాటి మార్కు మూవీ 
  • విలన్ గా శ్రీకాంత్ పరిచయం 
  • డిసెంబర్ 2వ తేదీన విడుదల

శ్రీకాంత్ తన కెరియర్ ను మొదలుపెట్టేసిన చాలా తక్కువ కాలంలోనే 100 సినిమాలను పూర్తి చేశాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. డాన్స్ .. ఫైట్స్ ఇలా ఏ విషయంలోను ఎవరూ వంక బెట్టకుండా తనని తాను మార్చుకుంటూ వెళ్లాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ .. వాకింగ్ స్టైల్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.

హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు శ్రీకాంత్, సీనియర్ విలన్స్ కి తనయుడిగా .. నెగెటివ్ షేడ్స్ కలిగిన కొన్ని పాత్రలు చేశాడు. అంటే యంగ్ విలన్ గా మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి శ్రీకాంత్ మరోసారి పూర్తిస్థాయి విలన్ గా తనని తాను ఆవిష్కరించుకోవడానికి రెడీ అవుతున్నాడు. బోయపాటి సినిమా 'అఖండ'లో ఆయన విలన్ గా కనిపించనున్నాడు.

గతంలో జగపతిబాబును బాలయ్య సినిమా 'లెజెండ్'తో విలన్ గా పరిచయం చేసింది బోయపాటినే. అప్పటి నుంచి జగపతిబాబు స్టార్ విలన్ గా దూసుకుపోతున్నాడు. ఇక అదే బాలయ్య సినిమాతో ఈ సారి శ్రీకాంత్ ను విలన్ గా చూపిస్తున్నాడు. ఈ సినిమాతో ఇక ప్రతినాయక పాత్రలతో బిజీ కావాలని శ్రీకాంత్ భావిస్తున్నాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Srikanth
Boapati
Balakrishna
Jagapathi Babu
  • Loading...

More Telugu News