KL Rahul: గాయంతో వైదొలగిన కేఎల్ రాహుల్... న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్

KL Rahul injured as Suryakumar Yadav replaces him
  • ఈ నెల 25 నుంచి రెండు టెస్టుల సిరీస్
  • తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రాహుల్
  • రెండు టెస్టులకు దూరం
  • దక్షిణాఫ్రికాతో సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రాహుల్ న్యూజిలాండ్ తో రెండు టెస్టుల సిరీస్ లో ఆడడంలేదని బీసీసీఐ వెల్లడించింది. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల 25 నుంచి కాన్పూర్ లో జరగనుంది. రెండో టెస్టు డిసెంబరు 3 నుంచి ముంబయిలో జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. అప్పట్లోగా కేఎల్ రాహుల్ కోలుకుంటాడని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. గాయంతో బాధపడుతున్న రాహుల్ ను ఫిట్ నెస్ సాధించేందుకు వీలుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి పంపారు.
KL Rahul
Injury
Suryakumar Yadav
Test Series
Team India
New Zealand

More Telugu News