Venkatesh Daggubati: 'ఎఫ్ 3'లో వెంకీకి రేచీకటి .. వరుణ్ కు నత్తి: అనిల్ రావిపూడి

F3 movie update

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 3'
  • 'ఎఫ్ 2'ను మించి ఉంటుంది
  • సంక్రాంతి బరిలో లేనట్టే
  • సోలో రిలీజ్ తో వస్తామన్న అనిల్  

అనిల్ రావిపూడి దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి, గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తన సినిమాలకి సంబంధించిన ఇంతవరకూ హిట్ అనే మాటనే తప్ప, ఫ్లాప్ అనే పదం వినలేదు. ఆయన తాజా చిత్రంగా 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

"ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామని  నేను .. దిల్ రాజుగారు భావించాము. కానీ సోలో రిలీజ్ గా వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాము. ఈ సినిమాలో వెంకటేశ్ - వరుణ్ తేజ్ పాత్రలను డిజైన్ చేసిన తీరు చాలా ఫన్ గా ఉంటుంది.

రేచీకటి గల పాత్రలో వెంకీ .. నత్తి ఉన్న పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సీన్స్ ఒక రేంజ్ వచ్చాయి. థియేటర్స్ లో ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు. 'ఎఫ్ 3' తరువాత కూడా ఈ ఫ్రాంఛైజీ కొనసాగుతుంది. తెలుగులోని స్టార్ హీరోలందరితోను సినిమాలు చేయాలనుంది" అని చెప్పుకొచ్చాడు.

Venkatesh Daggubati
Varun Tej
Tamannah
Mehreen
Suneel
  • Loading...

More Telugu News