Naga Chaitanya: 'బంగార్రాజు' నుంచి నాగచైతన్య ఫస్ట్ లుక్ విడుదల

Naga Chaitanya first look from Bangarraju revealed

  • సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి ప్రీక్వెల్ గా బంగార్రాజు
  • నాగ్, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం
  • రేపు చైతూ పుట్టినరోజు
  • అభిమానులకు ముందే కానుక అందించిన చిత్రబృందం

సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి ప్రీక్వెల్ గా వస్తున్న చిత్రం 'బంగార్రాజు'. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా నటిస్తుండడంతో చిత్రంపై క్రేజ్ మరింత పెరిగింది. రేపు (నవంబరు 23) నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని బంగార్రాజు చిత్రబృందం అక్కినేని అభిమానులకు కానుక అందించింది. ఈ చిత్రం నుంచి నాగచైతన్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమా టీజర్ రేపు ఉదయం 10.23 గంటలకు విడుదల కానుంది.

ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి కనువిందు చేయనుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News