Kinjarapu Ram Mohan Naidu: ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానం కలుగుతోంది: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu response on 3 capitals

  • రాజధాని వికేంద్రీకరణ బిల్లును పూర్తి స్థాయిలో రద్దు చేయాలి
  • రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది
  • సీఎం స్వయంగా ప్రకటన చేయాలి

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం మదిలో ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని చెప్పారు. దీనిపై సీఎం జగన్ స్వయంగా ప్రకటన చేయాలని అన్నారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు టీడీపీ పోరాడుతుందని అన్నారు.

Kinjarapu Ram Mohan Naidu
Telugudesam
3 capitals
Jagan
YSRCP
  • Loading...

More Telugu News