Mandali Shekhar: అమెరికాలో తెలంగాణ యువకుడి దుర్మరణం

Telangana youth died in a road accident in USA

  • ఎల్లికాట్ నగరంలో రోడ్డు ప్రమాదం
  • మండలి శేఖర్ మృతి
  • శేఖర్ స్వస్థలం నల్గొండ జిల్లా తెరాటి గూడెం
  • కుటుంబంలో తీవ్ర విషాదం

అమెరికాలోని ఎల్లికాట్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ఆ యువకుడి పేరు మండలి శేఖర్. వయసు 28 సంవత్సరాలు. స్వస్థలం నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెం. గత రెండేళ్లుగా శేఖర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.  దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.

శేఖర్ మరణవార్తను అమెరికా అధికారులు అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. కాగా, తమ కుమారుడి మృతదేహం అమెరికాలో ఉందని, భారత్ కు తీసుకువచ్చేందుకు సాయపడాలని అతడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.

Mandali Shekhar
Death
Road Accident
USA
Nalgonda District
Telangana
  • Loading...

More Telugu News