Siddipet: సిద్ధిపేటలో ఉద్రిక్తతలకు దారితీసిన కేసీఆర్ విగ్రహం ఏర్పాటు

BJP and Congress fires on KCR statue

  • లాల్ కమాన్ పై కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు
  • తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బీజేపీ, కాంగ్రెస్
  • విగ్రహాన్ని తొలగించిన పోలీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్ విగ్రహం ఏర్పాటు సిద్ధిపేటలో ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే సిద్ధిపేటకు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు  పట్టణంలోని లాల్ కమాన్ పైన కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వెంటనే అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించాలని నిన్న అర్ధరాత్రి ధర్నా నిర్వహించారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలకు, బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బీజేపీ, కాంగ్రెస్ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు అర్ధరాత్రి పూట చోటుచేసుకున్న ఉద్రిక్తతలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Siddipet
KCR
TRS
Statue
BJP
Congress
  • Loading...

More Telugu News