Nara Lokesh: గాల్లోంచి నేలమీదకు దిగితే సీఎంకు వరద కష్టాలు కనిపిస్తాయి: లోకేశ్

Lokesh comments on CM Jagan over floods
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
  • రాయలసీమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని లోకేశ్  ఆరోపణ
  • సొంత జిల్లాను కూడా విస్మరించారని వ్యాఖ్య  
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గాల్లోంచి నేలమీదకు దిగితే సీఎంకు వరద కష్టాలు కనపడతాయని అన్నారు. వర్షాలకు బాగా దెబ్బతిన్న రాయలసీమవైపు సీఎం కన్నెత్తి కూడా చూడలేదని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలు పట్టించుకోకపోవడం వల్లే ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందని విమర్శించారు. భారీ వర్షాలకు సొంత జిల్లాలో ఏమైందో కనుక్కునే తీరికే లేదా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.

వరద బాధితులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని భావించడం ఓ భ్రమ అని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు సాయపడాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
Nara Lokesh
CM Jagan
Floods
Rayalaseema

More Telugu News