Raghu Rama Krishna Raju: నారా భువనేశ్వరికి జరిగిన అవమానం... భూదేవికి జరిగినట్టే: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju fires on ysrcp

  • నందమూరి కుటుంబం ఎంతగా తల్లడిల్లిపోయిందో చూశాం
  • ఇది మొత్తం తెలుగుజాతికి జరిగిన అవమానం
  • వివేకా హత్య కేసును పక్కదోవ పట్టిస్తున్నారన్న రఘురాజు  

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల నీచపు మాటలతో నందమూరి కుటుంబం ఎంత తల్లడిల్లిపోయిందో చూశామని అన్నారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటన కేవలం ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినది కాదని... మొత్తం తెలుగుజాతికి జరిగిన అవమానమని చెప్పారు. మీ ఇళ్లలో ఆడవాళ్ల గురించి మాట్లాడితే మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుజాతి సంపద అని... ఆయనను కుటుంబ పెద్దగా భావించాలని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని మహిళలంతా ఏకమై ముందుకు కదలాలని అన్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడకుండా... మొత్తం వ్యవహారాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Raghu Rama Krishna Raju
YSRCP
Telugudesam
Nara Bhuvaneswari
Chandrababu
NTR
  • Loading...

More Telugu News