Tamilnadu: క్వారంటైన్ లోని తోటి మహిళా వైద్యులపై ఇద్దరు డాక్టర్ల అత్యాచారం

Two Women Doctors Raped While In Quarantine

  • చెన్నై, ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఘటన 
  • వీడియో తీసి బెదిరిస్తూ పలుమార్లు లైంగికదాడి
  • తాళలేక ఆరోగ్య మంత్రికి ఫిర్యాదు
  • నిందితుల అరెస్ట్.. ఉద్యోగాల నుంచి తొలగింపు 

క్వారంటైన్ లో ఉన్న తోటి మహిళా వైద్యులపై మరో ఇద్దరు డాక్టర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. అంతటితో ఆగకుండా అత్యాచార ఘటనను వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. చివరకు కటకటాలపాలయ్యారు.

చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లు చెన్నై టీ నగర్ లోని ఓ స్టార్ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్నారు. అదే హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న వెట్రిసెల్వన్ (35), మోహన్ రాజ్ (25) అనే మరో ఇద్దరు డాక్టర్లు.. మహిళా వైద్యుల గదికి వెళ్లారు. వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. దానిని వీడియో తీసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎంతకీ వారి అకృత్యాలు ఆగకపోతుండడంతో.. ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

వారి ఆదేశాల మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ విచారణ ప్రారంభించారు. తేనాంపేట మహిళా పోలీసుల విచారణలో నేరం నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారిద్దరినీ ఆరోగ్య శాఖ డిస్మిస్ చేసింది.

Tamilnadu
Crime News
Rape
Doctors
Quarantine Centre
Chennai
COVID19
  • Loading...

More Telugu News