CM Jagan: వరద ముంపు ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే

CM Jagan aerial survey in flood hit areas tomorrow
  • చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు
  • అనేక ప్రాంతాల్లో వరదలు
  • గన్నవరం నుంచి కడప చేరుకోనున్న సీఎం
  • కడప నుంచి హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే
భారీ వర్షాలతో అతలాకుతలమైన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లిలో ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడ్నించి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్ సర్వే ముగిసిన అనంతరం రేణిగుంట చేరుకుని, అక్కడినుంచి తిరిగి గన్నవరం వస్తారు. 
CM Jagan
Aerial Survey
Nellore District
Chittoor District
Kadapa District

More Telugu News