Smriti Irani: అమర జవాన్లపై పుస్తకం రాసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
- స్మృతి ఇరానీ రచయిత్రి అవతారం
- 2010 నక్సల్స్ దాడిపై పుస్తకం
- నాటి ఘటనలో 76 మంది జవాన్ల మృతి
- తన పుస్తకం ఆకట్టుకుంటుందన్న స్మృతి
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అమర జవాన్లపై ఆమె పుస్తకం రాశారు. 2010లో చత్తీస్ గఢ్ లోని దంతేవాడలో భద్రతా బలగాలకు చెందిన 76 మంది బలైన ఘటన కేంద్రబిందువుగా ఆమె లాల్ సలాం అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం నవంబరు 29న మార్కెట్లోకి రానుంది. వెస్ట్ ల్యాండ్ పబ్లిషింగ్ సంస్థ లాల్ సలాం పుస్తకాన్ని ముద్రించింది. తాజాగా ఈ పుస్తకం కవర్ పేజీని స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన పుస్తకం పాఠకుల ఆదరణకు నోచుకుంటుందన్న నమ్మకం ఉందని తెలిపారు. 2010లో నక్సల్స్ దాడిలో పెద్ద సంఖ్యలో జవాన్లు మరణించడం తెలిసిందే.