Enforcement Directorate: ఈడీ బాస్ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

Center extended tenure of ED Chief

  • రేపటితో ముగియనున్న సంజయ్ మిశ్రా పదవీకాలం
  • ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం
  • ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం పొడిగించేందుకు వీలుగా ఇటీవలే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రం

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. రేపటితో ఆయన పదవీకాలం ముగియనున్న తరుణంలో... మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 2022 నవంబర్ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఆయన ఈడీ చీఫ్ గా కొనసాగనున్నారు.

 కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని మూడేళ్ల వరకు పొడిగించేందుకు వీలుగా ఈనెల 14న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత తొలిసారి పదవీకాలం కొనసాగింపును పొందిన అధికారిగా మిశ్రా నిలిచారు.

Enforcement Directorate
Chief
Tenure
center
  • Loading...

More Telugu News