Raj Tarun: 'అనుభవించు రాజా' నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

Anubhavinchu Raja trailer released

  • రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమా
  •  కొత్త దర్శకుడి పరిచయం
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్
  • ఈ నెల 26వ తేదీన విడుదల

రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. అన్నపూర్ణ స్టూడియస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ ను వదిలారు. నాగార్జున చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

విలేజ్ లో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో, హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ గార్డుగా మారతాడు. ఆమెను రోజూ చూడొచ్చు .. మాట్లాడొచ్చు అని అలా ప్లాన్ చేశాడనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో విలన్ అజయ్ అనే విషయం అర్థమవుతోంది.

"బంగారంగాడి మనసు సినిమా హాల్ లాంటిది .. వారానికో సినిమా వత్తావుంటది .. పోతావుంటది .. ఏదీ పర్మినెంట్ గా ఆడదు ఇక్కడ" అనే రాజ్ తరుణ్ డైలాగ్, "మనం గెలవాలంటే వాడి పుంజు ఈ బరిలో ఉండకూడదు .. వాడు ఈ ఊళ్లో ఉండకూడదు" అనే అజయ్ డైలాగ్ వాళ్ల పాత్రల స్వభావాలను చెప్పేస్తున్నాయి. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News