Karnataka: జన్మదిన వేడుకల్లో ప్రసంగిస్తూనే ప్రాణాలు వదిలిన స్వామీజీ

Balobala swamiji died while speaking

  • కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘటన
  • బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహా స్వామీజీ జన్మదిన వేడుకలకు భక్తులు
  • స్వామీజీ ప్రసంగాన్ని భక్తులు చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి

తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూనే ఓ స్వామీజీ ప్రాణాలు విడిచారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన జన్మదిన వేడులకు హాజరైన భక్తులను ఉద్దేశించి బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహాస్వామీజీ ప్రసంగం ప్రారంభించారు. అలా మాట్లాడుతున్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.

దీంతో కూర్చున్న కుర్చీలోనే తల వెనక్కి వాల్చి కన్నుమూశారు. పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమైనప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందారు. స్వామీజీ ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న భక్తుల మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యం రికార్డు కాగా, తాజాగా అది సామాజిక మాధ్యమాలకు ఎక్కింది.

Karnataka
Balobala
Belagavi
Swamiji
  • Error fetching data: Network response was not ok

More Telugu News