Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

markets ends with losses

  • 396 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 110 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 7.31 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో తదితర కంపెనీలు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 396 పాయింట్లు నష్టపోయి 60,322కి పడిపోయింది. నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 17,999కి దిగజారింది. ఆటోమొబైల్స్ సూచీ రెండున్నర శాతం వరకు నష్టపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (7.31%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.44%), టెక్ మహీంద్రా (1.43%), బజాజ్ ఫైనాన్స్ (0.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.24%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.58%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.31%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.05%), ఎన్టీపీసీ (-2.01%).

  • Loading...

More Telugu News