TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. సిద్ధిపేట మాజీ కలెక్టర్ కు అవకాశం!

List of TRS MLC Candidates

  • ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
  • గుత్తా, కడియం, బండ ప్రకాశ్, కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లిలకు అవకాశం
  • ఏకగ్రీవంగా గెలవనున్న అందరు అభ్యర్థులు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించింది. మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రకటించారు. నిన్న ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారు.

ఇంకా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాశ్, కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రామిరెడ్డిల పేర్లు ఉన్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి రోజు కావడంతో అభ్యర్థులందరూ అసెంబ్లీకి చేరుకున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు ఈ ఆరు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.

TRS
MLC Candidates
KCR
  • Loading...

More Telugu News