'ఖతీజా' పాత్రలో సమంత లుక్ ఇదే!
- విజయ్ సేతుపతి హీరోగా తాజా చిత్రం
- వైవిధ్యభరితమైన పాత్రలో సమంత
- కీలకమైన పాత్రలో నయనతార
- డిసెంబర్లో థియేటర్స్ లో విడుదల
ఈ సినిమాలో రాంబో పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. తాజాగా 'ఖతీజా'గా సమంత పాత్రను పరిచయం చేస్తూ ఆమె పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో ఆమె చాలా మోడ్రన్ గా కనిపించనుందనే విషయం అర్థమవుతోంది. మరో ప్రధానమైన పాత్రలో నయనతార అలరించనుంది. త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను వదలనున్నారు.
విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదు .. నిర్మాణ భాగస్వామి కూడా. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. డిసెంబర్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ స్పష్టం చేశారు.