రాజ్ తరుణ్ కి హిట్ దక్కేనా?
- ఆరంభంలో వరుస హిట్లు
- ఇటీవల దక్కని విజయాలు
- తాజా చిత్రంగా 'అనుభవించు రాజా'
- ఈ నెల 26వ తేదీన విడుదల
ఆడియన్స్ తో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాడుగానీ .. విజయాలను మాత్రం అందుకోలేకపోయాడు. మొదట్లో అతనిని మురిపించిన సక్సెస్ లు ఆ తరువాత ముఖం చాటేస్తూ వచ్చాయి. దాంతో ఆయన హిట్ అనే మాట వినక చాలాకాలమే అయింది. ఎప్పటికప్పుడు కాస్త కొత్తగా అనిపించిన కథలను చేసుకుంటూ వచ్చాడుగానీ, ఏ ప్రయత్నం కూడా ఆయనకి విజయాన్ని అందించలేకపోయింది.
ఈ నేపథ్యంలోనే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 'అనుభవించు రాజా' చేశాడు. గ్రామీణ నేపథ్యంలో .. యూత్ తో పాటు మాస్ కంటెంట్ కూడా కలిగిన సినిమా ఇది. ఈ సినిమాలో జీవితానికి అర్థం .. పరమార్థం ఎంజాయ్ చేయడమే అనే కోణంలో ఒక పాటను వదిలారు. సర్దుకుపోతేనే జీవితం సరదాగా ఉంటుందనే కోణంలో మారో పాట వదిలారు. పల్లెలో జల్సా రాయుడిగా కనిపించిన రాజ్ తరుణ్, పట్నంలో బుద్ధిగా జాబ్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఇది వైవిధ్యభరితమైన కథగానే కనిపిస్తోంది. ఈ నెల 26వ తేదీన వస్తున్న ఈ సినిమాతోనైనా ఆయనకి హిట్ పడుతుందేమో చూడాలి.