Sensex: అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

markets ends with profits

  • ఒకానొక సమయంలో 400 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న హెవీ వెయిట్ కంపెనీలు
  • చివరకు 32 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈనాటి ఇంట్రాడేలో ఒకానొక సమయంలో 400 పాయింట్ల వరకు లాభపడ్డ మార్కెట్లు... ఆ తర్వాత రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనడంతో లాభాలను కోల్పోయాయి. చివరకు సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 60,718 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 18,109 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.30%), ఐటీసీ (2.06%), నెస్లే ఇండియా (1.90%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.18%), టీసీఎస్ (0.90%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.76%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.67%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.60%), ఎల్ అండ్ టీ (-0.56%).

  • Loading...

More Telugu News