Chiranjeevi: కోల్ కతా నేపథ్యంలో 'భోళా శంకర్'

Bhola Shankar movie update

  • 'భోళా శంకర్'గా చిరంజీవి
  • దర్శకుడిగా మెహర్ రమేశ్
  • చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్  
  • హైదరాబాద్ లో మొదలైన షూటింగ్

చిరంజీవి-మెహర్ రమేశ్ కాంబినేషన్లో 'భోళా శంకర్' సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ లో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ మొదలైపోయింది. ఇది పక్కా మాస్ మసాలా మూవీ. గతంలో ఆయన చాలా మాస్ సినిమాలు చేశారు. రీ ఎంట్రీ తరువాత ఆయన చేస్తున్న ఫస్టు మాస్ మూవీ ఇదే.

ఈ సినిమాలో చిరంజీవి లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. బలమైన యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా చెల్లెలి సెంటిమెంట్ తో ముడిపడి నడుస్తాయి. చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. ఇక కథానాయిక పాత్రలో తమన్నా కనువిందు చేయనుంది. ఈ జోడీకి తగిన ట్యూన్స్ ను మహతి స్వరసాగర్ అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతున్నప్పటికీ, చాలావరకూ కోల్ కతా నేపథ్యంలో కథ నడుస్తుందని అంటున్నారు. ఆ తరువాత ఎక్కువ రోజుల పాటు అక్కడ షూటింగు జరపనున్నారని చెబుతున్నారు. 'చూడాలని వుంది' సినిమాలో 'యమహా నగరి .. కలకత్తాపురీ' అంటూ అలరించిన మెగాస్టార్, ఈ సినిమా కోసం మళ్లీ కోల్ కతా నేపథ్యంలో కనిపించనున్నారన్న మాట.

Chiranjeevi
Tamannah
Keerthy Suresh
Bhola Shankar Movie
  • Loading...

More Telugu News