Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ‌ఖాన్‌ను సుదీర్ఘంగా విచారించిన సిట్

NCBs SIT Questioned Aryan Khan in Drugs Case

  • క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్‌పై ఆరోపణలు
  • నిన్న సాయంత్రం విచారణకు హాజరు
  • డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు, వాట్సాప్ చాటింగులపై ప్రశ్నలు

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ నిన్న సాయంత్రం ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. క్రూయిజ్ నౌకలో పార్టీ, ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగానికి సంబంధించి అర్ధరాత్రి వరకు సిట్ ఆయనను ప్రశ్నించింది. నౌక వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలు, స్నేహితులకు ఉన్న అలవాట్లు తదితర వాటి గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది.

అలాగే, కస్టడీలో ఉన్నప్పుడు జైలు అధికారులు ఎలా చూసుకున్నారు? ముడుపుల కోసం ఎవరైనా డిమాండ్ చేశారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నార్కోటిక్స్ అధికారులు చెబుతున్న వాట్సాప్ చాటింగులపైనా ఆర్యన్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్‌సీబీ డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసుపు విచారణ కొనసాగుతోందని, వీలైనంత త్వరగా కేసు ఓ కొలిక్కి వస్తుందని చెప్పారు.

Aryan Khan
Bollywood
NCB
Cruise Ship
Drug Case
Shahrukh Khan
  • Loading...

More Telugu News