India: భారత్ లో గత 24 గంటల్లో కరోనా వల్ల 555 మంది మృతి.. అప్డేట్స్ ఇవిగో!

India reports 11850 new corona cases

  • గత 24 గంటల్లో 11,850 మందికి కరోనా పాజిటివ్
  • ఆరోగ్యవంతులైన 12,403 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,308

భారత్ లో గత 24 గంటల్లో 12,66,589 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 11,850 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందు రోజు కంటే 5 శాతం కేసులు తగ్గాయి. గత 274 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 555 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,36,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,63,245 మంది కరోనా కారణంగా చనిపోయారు.

నిన్న 12,403 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు 3.44 కోట్ల మంది కరోనా బారిన పడగా... 3.38 కోట్ల మంది కోలుకున్నారు. మరోవైపు నిన్న 58.42 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా వేయించుకున్న వారి సంఖ్య 1,11,40,48,134కి చేరుకుంది.

India
Corona Virus
Updates
  • Loading...

More Telugu News