Sri Lakshmi: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court dismissed Srilakshmi petition
  • ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై విచారణ
  • సీబీఐ విచారణ నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటిషన్
  • తాము ఆదేశాలు ఇవ్వలేమన్న సుప్రీం
  • గతంలో ఇదే అంశంలో శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలేవరకు ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ నిలిపివేసేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం శ్రీలక్ష్మి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. విచారణ చివరిదశలో ఉన్న సమయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

గతంలో శ్రీలక్ష్మి ఇదే తరహా అభ్యర్థనతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఆ తీర్పును సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేస్తే ఇక్కడా అదే పరిస్థితి ఎదురైంది. తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలు పరిశీలించి తీర్పు ఇచ్చినట్టుగా అర్థమవుతోందని జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ స్పష్టం చేసింది.
Sri Lakshmi
IAS
Supreme Court
Obulapuram Mining Case
Andhra Pradesh

More Telugu News