Nadendla Manohar: జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎందుకింత చిన్నచూపు?: నాదెండ్ల

Nadendla Manohar take a dig at AP govt on PRC Report
  • ఏపీ సర్కారుపై నాదెండ్ల ధ్వజం
  • ఉద్యోగులను పడిగాపులు కాచేలా చేస్తున్నారని ఆగ్రహం
  • పీఆర్సీ నివేదికను దాయడం ఎందుకంటూ ట్వీట్
  • ఉద్యోగ సంఘాల నేతల ఫొటో పంచుకున్న వైనం
ఉద్యోగ సంఘాల నేతలను ఏపీ ప్రభుత్వం అవమానించిందంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. పీఆర్సీ నివేదిక కోరిన ఉద్యోగ సంఘాల నాయకులను అర్ధరాత్రి వరకు సచివాలయంలో పడిగాపులు పడేలా చేయడం ఉద్యోగులను కించపర్చడమేనని పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎందుకింత చిన్నచూపు? అని ప్రశ్నించారు. అసలు, పీఆర్సీ నివేదికను సీల్డ్ కవర్ లో ఎందుకు దాచిపెడుతున్నారు? అంటూ నిలదీశారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. అంతేకాదు, సచివాలయంలో రాత్రివేళ పీఆర్సీ నివేదిక కోసం చూస్తున్న ఉద్యోగ సంఘాల నేతల ఫొటోను కూడా పంచుకున్నారు.  
Nadendla Manohar
AP Employees
PRC Report
CM Jagan
Andhra Pradesh

More Telugu News