Prabhas: షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆదిపురుష్'.. రూ. 400 కోట్లతో తెరకెక్కిన చిత్రం!

Prabhas Adipurush shooting ends

  • ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిన 'ఆదిపురుష్'
  • 3డీలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
  • కేవలం 103 రోజుల్లో చిత్రీకరణ పూర్తి

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్'. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో 3డీ చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తుండగా.... కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. లంకేశుడు రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ పోషించారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

భారీ తారాగణం, బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓం రౌత్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. 103 రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఒక అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుందని చెప్పారు. తాము క్రియేట్ చేసిన మేజిక్ ను మీ అందరితో పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు.

Prabhas
Adipurush Movie
Tollywood
Bollywood
Shooting
  • Loading...

More Telugu News