Nisha Dahiya: నేను బతికే ఉన్నా: రెజ్లర్ నిషా దహియా

I am alive says wrestler Nisha Dahiya
  • నిషా దహియా, ఆమె సోదరుడిని కాల్చి చంపేశారంటూ వార్తలు
  • తాను సురక్షితంగా ఉన్నానన్న నిషా
  • గోండాలో జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చానని వివరణ
భారత మహిళా రెజ్లర్ నిషా దహియాను కాల్చి చంపేశారనే వార్తలు ఈ మధ్యాహ్నం నుంచి వెల్లువెత్తాయి. ఆమెతో పాటు, ఆమె సోదరుడిని చంపేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాను బతికే ఉన్నానని ఆమె ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తనను, తన సోదరుడిని కాల్చి చంపినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.

గోండాలో జరుగుతున్న జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనేందుకు తాను వచ్చానని తెలిపారు. తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. ఆమె మాట్లాడిన వీడియోను భారత రెజ్లింగ్ సమాఖ్య విడుదల చేసింది. సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ 65 కేజీల విభాగంలో నిషా దహియా కాంస్య పతకాన్ని సాధించారు.
Nisha Dahiya
Wrestler

More Telugu News