Nikhil: నిఖిల్ ఈ ఏడాదికి ఇంతేనా?

Nikhil movies update

  • ముగింపు దశలో '18 పేజెస్'
  • అప్ డేట్ కి దూరంగా 'కార్తికేయ 2'
  • సెట్స్ పైకి మరో రెండు ప్రాజెక్టులు
  • నాలుగు సినిమాలు వచ్చే ఏడాదిలోనే

తెరపైనే కాదు .. బయట కూడా నిఖిల్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనతో ఒకసారి సినిమా చేసిన ప్రతి దర్శకుడితో ఆయన టచ్ లోనే ఉంటాడు. ఆ తరువాత సినిమాలకి కావలసిన ప్రణాళికలు రెడీ చేస్తూనే ఉంటాడు. తన దగ్గరికి ఒక కథ వచ్చిన దగ్గర నుంచి, ఆ కథ సెట్స్ పైకి వెళ్లేవరకూ దర్శక నిర్మాతలతో ఆయన ట్రావెల్ అవుతూనే ఉంటాడు. ఇతర హీరోలకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకత చాటుతుంటాడు.

అలాంటి నిఖిల్ కి 'అర్జున్ సురవరం' హిట్ తరువాత గ్యాప్ వచ్చేసింది. కొంతవరకూ కరోనా కారణమైతే, మరికొంత నిఖిల్ ప్లానింగ్ అనే చెప్పుకోవాలి. అలా అని చెప్పేసి ఆయన ఖాళీగా ఏమీ లేడు. ఒక వైపున '18 పేజెస్' .. మరో వైపున 'కార్తికేయ 2' చేస్తూనే, మరో రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. అయితే వీటిలో ఏ ఒక్కటీ ఈ ఏడాది వచ్చే అవకాశం లేకపోవడమే విచారించదగిన విషయం.

గీతా ఆర్ట్స్ 2లో చేస్తున్న '18 పేజెస్' పై మంచి అంచనాలు ఉన్నాయి. సుకుమార్ రాసిన కథ .. స్క్రీన్ ప్లేతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ నిర్మాతలుగా 'కార్తికేయ 2' నిర్మితమవుతోంది. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి ఈ ఏడాదిలో దింపేసి ఉంటే బాగుండేది. అలా అనుకోకుండా .. వచ్చే ఏడాది ఆయన నుంచి నాలుగు సినిమాలు రానున్నాయని చెప్పుకోవడమే కరెక్టేమో!  

Nikhil
Chandu Mondeti
Palnati Surya Prathap
  • Loading...

More Telugu News