Shabbir Ali: నా సలహాలు వింటున్నట్టు కేసీఆర్ నటిస్తున్నారు: షబ్బీర్ అలీ

Shabbir Ali fires on KCR

  • కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే
  • దళితుడిని సీఎం చేయలేదనే విషయాన్ని ఒప్పుకున్నారు
  • దళిత సీఎం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నామో కేసీఆర్ చెప్పాలి

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. మేమే కేసీఆర్ ను దళితుడిని ముఖ్యమంత్రిని చేయనివ్వలేదని షబ్బీర్ అలీ చెప్పారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదనే విషయాన్ని కేసీఆర్ సిగ్గులేకుండా ఒప్పుకున్నారని అన్నారు.

 అయితే, ఈ వ్యవహారంలో తన పేరును లాగడం సరికాదని చెప్పారు. అసలు దళిత ముఖ్యమంత్రి గురించి ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నామో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. తాను ఇచ్చే సలహాలను వింటున్నట్టు కేసీఆర్ నటిస్తున్నారని మండిపడ్డారు. మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే... తన సలహాలను మీరు వినేటట్టయితే... వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి, దళితుడికి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News