Nagarjuna: 'బంగార్రాజు' నుంచి ఫస్టు లిరికల్ సాంగ్!

Bangarraju First lyrical Video Song Released

  • నాగార్జున హీరోగా రూపొందుతున్న 'బంగార్రాజు'
  • స్వర్గంలో 'బంగార్రాజు' ఆటాపాటా  
  • మాస్ ఆడియన్స్ ను పట్టేసే పాట
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్

గతంలో నాగార్జున గ్రామీణ నేపథ్యంలో .. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఆ సినిమా, ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో ఆయన పోషించిన 'బంగార్రాజు' పాత్ర జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. దాంతో ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన సినిమా చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'బంగార్రాజు' స్వర్గంలో రంభ .. ఊర్వశి .. మేనకలతో కలిసి హుషారెత్తించే సాంగ్ ఇది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. ధనుంజయ్ .. మోహన భోగరాజు .. నూతన మోహన్ .. హరిప్రియ ఆలపించారు. ఇక నాగార్జున కూడా అక్కడక్కడా స్వరం కలపడం విశేషం.

'బంగార్రాజు' తాను బ్రతికున్నపుడు ఎంత రొమాంటిక్కో .. స్వర్గానికి వెళ్లిన తరువాత అక్కడా అంతే రొమాంటిక్ అనే విషయాన్ని ఆవిష్కరించే పాట ఇది. పల్లె పడుచులను ఆటపట్టించినట్టే .. రంభ ..ఊర్వశి .. మేనకలతో కలిసి బంగార్రాజు చిందులేసే ఈ కలర్ పుల్ సాంగ్, మాస్ ఆడియన్స్ మనసులకు పట్టేసే ఛాన్స్ ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News