Karthikeya: ఇప్పుడైనా కార్తికేయకు హిట్ పడేనా?      

Karthikeya movies update

  • 'ఆర్ ఎక్స్ 100'తో క్రేజ్
  • వరుసగా వచ్చిన ఛాన్సులు
  • నిరాశపరిచిన ఫలితాలు
  • ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తలు

కార్తికేయ .. పేరు వినగానే 'ఆర్ ఎక్స్ 100' సినిమా గుర్తుకువస్తుంది. ఆ సినిమాతో ఆయన ఒకేసారి యూత్ కీ .. మాస్ ఆడియన్స్ కి చేరువయ్యాడు. మంచి హైటూ .. పర్సనాలిటీ ఉండటంతో ఇక ఈ హీరో ఒక రేంజ్ లో దూసుకుపోతాడని అనుకున్నారు. యాక్షన్ .. రొమాన్స్ తో కూడిన కథలకు బాగా సెట్ అవుతాడని చెప్పుకున్నారు. అనుకున్నట్టుగానే కార్తికేయకు వరుస అవకాశాలైతే వచ్చాయిగానీ .. వాటి వెనుక విజయాలు మాత్రం రాలేదు.

'ఆర్ ఎక్స్ 100' తరువాత ఆ స్థాయి హిట్ ను ఆయన సొంతం చేసుకోలేకపోయాడు. 'హిప్పీ' .. 'గుణ 369' .. '90 ML' సినిమాలు ఆయనను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక 'చావుకబురు చల్లగా' సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో చేశాడు. అయితే చావు డప్పుల మధ్యలో ఎవరు ఎవరికీ లైన్ వేయలేరు .. అసలు అలాంటి చోటున ఆ వాతావరణమే ఉండదు. ఈ కారణంగానే ఈ కథకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు.

ఇక ఇప్పుడు ఆయన శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ, 'రాజా విక్రమార్క' సినిమా చేశాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. యాక్షన్ కామెడీ జోనర్లో ఈ కథ నడుస్తుంది. సాధారణంగా ఇలాంటి కథలు చాలా విపులంగా చెబితేనే తప్ప సాధారణ ప్రేక్షకులకు అర్థంకావు. ఇప్పటివరకూ తెలిసీ తెలియక కొన్ని సినిమాలు చేశాను. ఇకపై నుంచి తాను ఎంపిక చేసుకునే స్క్రిప్టులు అభిమానులు గర్వపడేలా ఉంటాయని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హామీ లాంటిదే ఇచ్చాడు. వరుస ఫ్లాపులకు ఈ విజయంతో విరుగుడు చెప్పకపోతే కార్తికేయకు కష్టమే.

Karthikeya
Tanya Ravichandran
Sai Kumar
  • Loading...

More Telugu News