Karthikeya: ఆ విషయాలను వినాయక్ దగ్గరే నేర్చుకున్నాను: 'రాజా విక్రమార్క' డైరెక్టర్
- కొత్త దర్శకుడిగా శ్రీ సరిపల్లి
- యాక్షన్ కామెడీగా 'రాజా విక్రమార్క'
- కథానాయికగా తాన్య రవిచంద్రన్
- ఈ నెల 12వ తేదీన విడుదల
కార్తికేయ తాజా చిత్రంగా 'రాజా విక్రమార్క' సినిమా రూపొందింది. '88' రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా ద్వారా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి శ్రీ సరిపల్లి మాట్లాడారు.
"నేను పుట్టి పెరిగింది విజయవాడలో .. ఆ తరువాత యూఎస్ లో చదువు పూర్తిచేశాను. మొదటి నుంచి కూడా సినిమాల పట్ల ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ ను కావాలని ఉండేది. అందువలన యూఎస్ నుంచి వచ్చిన తరువాత, వినాయక్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులో జాయిన్ అయ్యాను.
డైరెక్షన్ కి సంబంధించిన విషయాలను నేను వినాయక్ గారి దగ్గరే నేర్చుకున్నాను. ఈ సినిమాకి ముందు నాకు కార్తికేయతో ఎలాంటి పరిచయం లేదు. కథ నచ్చడం వల్లనే ఆయన చేస్తానని అన్నారు. ఎన్.ఐ.ఎ.లో కొత్తగా చేరిన హీరో చేసిన ఒక పొరపాటు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేదే కథ" అని చెప్పుకొచ్చారు.