Sajjanar: అతనిపై కేసు నమోదైంది.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం: సజ్జనార్

Case filed against MLA aide who attacked RTC driver says Sajjanar

  • ఎమ్మెల్యే కారుకే సైడివ్వవా? అంటూ ఆర్టీసీ డ్రైవర్ పై ఎమ్మెల్యే అనుచరుడి చిందులు
  • ఈ వ్యవహారాన్ని వీడియో తీసిన ప్రయాణికుడు
  • నిందితుడిపై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారన్న సజ్జనార్

టీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ ను ఓ ఎమ్మెల్యే అనుచరుడు బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమ్మెల్యే కారుకే సైడివ్వవా? అంటూ ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ వీఆర్ రెడ్డిని బూతులు తిట్టాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం సూర్యజ్యోతి కాటన్ మిల్లు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

వనపర్తి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తోంది. ఈ సమయంలో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఓ కారు వెనక నుంచి వచ్చింది. బస్సును ఓవర్ టేక్ చేసి, బస్సు ముందు ఆగింది. కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ తో గొడవ పడ్డారు. బస్సు డోర్ లాగే ప్రయత్నం చేశారు. డోర్ తీయకపోవడంతో కర్రతో డోరును కొట్టారు. ఈ వ్యవహారాన్ని బస్సులోని ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. నిందితుడిపై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. నిందితుడిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదని అన్నారు.

  • Loading...

More Telugu News