Vijay Devarakonda: అప్పట్లో మా గల్లీలో కూడా నేను ఎవరికీ తెలియదు: విజయ్ దేవరకొండ

Pushpaka Vimanam movie update

  • హీరో కావడానికి చాలా కష్టాలు పడ్డాను
  • అందుకోసమే నేను నిర్మాతగా మారాను
  • ఒకప్పుడు ఇంటికి రెంట్ కట్టలేకపోయాము
  • నా ఫ్యాన్స్ పై నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది   

ఒక వైపున హీరోగా తనని తాను నిరూపించుకుంటూ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విజయ్ దేవరకొండ, మరో వైపున నిర్మాతగా కూడా నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన నిర్మించిన 'పుష్పక విమానం' ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడాడు.

"హీరోగా నేను ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నిర్మాతలు దొరక్క చాలా కష్టాలు పడ్డాను. నా తరువాత వచ్చేవాళ్లు ఆ కష్టాలు పడకూడదనే ఒక బలమైన ఎమోషన్ తో నేను సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఈ బాధ్యతను మోయడం చాలా కష్టంగా ఉంది .. అయినా అవకాశం పొందినవాళ్లు స్టేజ్ పై మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. కష్టమైనా కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే అనుకుంటున్నాను.

మా పేరెంట్స్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతూ .. నాకు పెట్రోల్ డబ్బులు ఇచ్చి ఆడిషన్స్ కి పంపించారు. సినిమాల్లోకి రాకముందు నేను ఎవరనేది మా గల్లీలో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి నేను ఒక యాక్టర్ గా .. ప్రొడ్యూసర్ గా వైజాగ్ లో స్టేజ్ పై నిలబడి ఉన్నాను. నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ .. మీ మీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్" అని చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda
Anand Devarakonda
Shanvi Meghana
Geeth Saini
  • Loading...

More Telugu News