Anand Devarakonda: మా నాన్న హీరో కాలేకపోయాడు .. మేమయ్యాం: ఆనంద్ దేవరకొండ

Pushpaka Vimanam movie update

  • ఈ సినిమాలో ఇన్నోసెంట్ గా కనిపిస్తాను
  • నన్ను వదిలేసి నా పెళ్లామ్ వెళ్లిపోతుంది  
  • మా నాన్న ఎర్రబస్సు ఎక్కి ఇక్కడికి వచ్చాడు
  • ఆయన కోరికను మేము నెరవేర్చాము

ఆనంద్ దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్లో 'పుష్పక విమానం' సినిమాను నిర్మించాడు. గీత్ శైని - శాన్వి మేఘన కథానాయికలుగా నటించిన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమా, నిన్న రాత్రి వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.

ఈ వేదికపై ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ .. 'ఈ సినిమాలో నేను గవర్నమెంట్ టీచర్ సుందరం పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర చాలా పద్ధతిగా .. ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. అలాంటి నన్ను వదిలేసి నా పెళ్ళాం వెళ్లిపోతుంది. ఎందుకు వెళ్లిపోయింది? ఎవరితో వెళ్లిపోయింది? అనేదే కథ. అందుకు ఆన్సర్ మీకు నవంబర్ 12న దొరుకుంది.

ఈ సినిమా నిర్మాతలలో మా డాడీ ఒకరు. ఆయన ఇక్కడికి రాలేదు .. ఇంట్లో టీవీలో ఇప్పుడు ఈ ఈవెంట్ చూస్తుంటాడు. ఆయన హీరో అవ్వాలనే ఉద్దేశంతో ఎర్రబస్సు ఎక్కి ఇక్కడికి వచ్చాడు. కానీ కొన్ని కారణాల వలన కాలేకపోయాడు. ఇప్పుడు మా అన్నయ్య .. నేను ఇద్దరం హీరోలమై ఆయన కోరికను నెరవేర్చినందుకు గర్వంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.

Anand Devarakonda
Shanvi Meghana
Geeth Saini
  • Loading...

More Telugu News