Sharukh Khan: మీడియా నుంచి తప్పించుకోవడానికి గొడుగు చాటున దాగిన షారుఖ్ ఖాన్!

Sharukh reportedly hide his face with an umbrella spotted at airport

  • డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్
  • ఇటీవలే బెయిల్
  • ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న షారుఖ్
  • మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడని షారుఖ్

తన కుమారుడు ఆర్యన్ ఖాన్ అనూహ్యరీతిలో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 6న షారుఖ్ ఓ ప్రైవేటు జెట్ విమానంలో ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లారు. నేడు తిరిగి ముంబయి చేరుకున్నారు. షారుఖ్ రాకను మీడియా వర్గాలు పసిగట్టాయి. అటు మీడియా వర్గాల సందడిని ముందే గమనించిన షారుఖ్ ముంబయి ఎయిర్ పోర్టులోని కలినా టెర్మినల్ వద్ద గొడుగు చాటున ముఖాన్ని దాచుకున్నారు.

ఓ సెక్యూరిటీ గార్డు గొడుగు అందివ్వగా, ఆ గొడుగు చాటున కారు ఎక్కి వెళ్లిపోయారు. ప్రైవేటు జెట్ దిగిన షారుఖ్ ఎక్కడంటూ వెదుకుతున్న మీడియా కెమెరాలు గొడుగు చాటున ఉన్న వ్యక్తి దిశగా దృష్టి సారించాయి. అది షారుఖ్ ఖానే అని సన్నిహిత వర్గాలు నిర్ధారించాయి. గొడుగును ముఖానికి అడ్డుపెట్టుకుని ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటికి వెళ్లిపోవడం మీడియా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఇటీవలే డ్రగ్స్ కేసులో బెయిల్ లభించడం తెలిసిందే. ఆర్యన్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం ఓ దిగ్భ్రాంతికర పరిణామం కాగా, అతి కష్టమ్మీద బెయిల్ పై బయటికి వచ్చాడు. డ్రగ్స్ కేసు నేపథ్యంలోనే షారుఖ్ మీడియా ముందుకు వచ్చేందుకు సాహసించడంలేదని తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News